'సన్ పెడల్ రైడ్' యువకుల దేశవ్యాప్త యాత్ర - yatra
'సన్ పెడల్ రైడ్' పేరిట నలుగురు యువకులు దేశవ్యాప్త యాత్ర చేస్తున్నారు. పర్యావరణహిత వాహనాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.
పర్యావరణహిత వాహనాల వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు నలుగురు యువకులు. ఏపీ, కర్ణాటక, పశ్చిమ బంగ, మహారాష్ట్రకు చెందిన నలుగురు యువకులు 'సన్ పెడల్ రైడ్' పేరిట దేశవ్యాప్తంగా ప్రజలకు చైతన్యం కల్పిస్తున్నారు. ఈ యాత్ర కోసం వివిధ సంస్థలు వారికి ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నాయి. ప్రస్తుతం ఆ నలుగురు కాకినాడకు చేరుకున్నారు. వోల్టా ఆటోమోటివ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ తయారుచేసిన కాలుష్యరహిత ఆటోను వారు ప్రదర్శించారు. పలువురు ఔత్సాహికులు ఆ ఆటోను నడిపారు. ఆటోకు బ్యాటరీని అనుసంధానించి ...దానికి సౌరఫలకం ద్వారా శక్తి అందిస్తున్నట్లు యువబృందం తెలిపింది.