తూర్పుగోదావరి జిల్లాలో కరోనా కట్టడికి అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా.మల్లికార్జున్ చెప్పారు. లాక్‌డౌన్ ఆంక్షలు సడలించిన తర్వాత రాకపోకలు పెరిగి...వైరస్ కేసుల సంఖ్య పెరిగిందన్నారు. జిల్లాలో ఇప్పటివరకూ 72వేల మందికి పరీక్షలు నిర్వహిస్తే... 595 మందికి పాజిటివ్ ఉన్నట్లు తేలిందని పేర్కొన్నారు. వైరస్ కేసులున్న 80 ప్రాంతాల్లో కంటైన్‌మెంట్ జోన్లు ఏర్పాటుచేసి ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. ప్రస్తుతం యాక్టివ్‌కేసులు 329 ఉంటే 256 రికవరీ అయ్యారని వివరించారు. విజయవాడ రెడ్జోన్లో విధులు నిర్వహించి జిల్లాకు వచ్చిన ఏపీఎస్పీ బెటాలియన్ సిబ్బంది 30మందిలో పాజిటివ్ కేసులు నమోదయ్యాయని డీఎంహెచ్ఓ వెల్లడించారు.
'కంటైన్‌మెంట్ జోన్లను నిరంతరం పర్యవేక్షిస్తోన్నాం'
తూర్పుగోదావరి జిల్లాలోని కరోనా కేసులున్న 80 ప్రాంతాల్లో కంటైన్‌మెంట్ జోన్లు ఏర్పాటు చేశామని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. వీటిని నిరంతరం పర్యవేక్షించేలా చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు.
కంటైన్‌మెంట్ జోన్ల పర్యవేక్షణపై జిల్లా వైద్యాధికారుల స్పందన