నేరాల నియంత్రణకు పటిష్టమైన చర్యలు: ఎస్పీ - east_sp_review
ప్రజలకు జవాబుదారీతనం, పారదర్శకతతో కూడిన పాలన అందించాలని సీఎం జగన్ ఆదేశించినట్లు.. తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ విశాల్ గున్నీ పోలీసు సిబ్బందికి సూచించారు.
కాకినాడలోని ఎస్పీ కార్యాలయంలో జిల్లాలో నేరాల నియంత్రణ, ప్రజలకు అందించాల్సిన మెరుగైన పాలనపై జిల్లా ఎస్పీ విశాల్ గున్నీ సమీక్ష నిర్వహించారు. గతవారం సీఎం జగన్, డీజీపీ గౌతమ్ సవాంగ్ తో జరిగిన సమీక్ష వివరాలు జిల్లా పోలీసు యంత్రాంగానికి వివరించారు. ఎస్సీ, ఎస్టీలు, మహిళలు, బాలలకు సంబంధించిన ఫిర్యాదులపై వేగంగా స్పందించాలని సూచించారు. జిల్లాలో మద్యం గొలుసు దుకాణాలపై ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టనున్నట్లు తెలిపారు. స్టేషన్ కు వచ్చిన ప్రజలతో మర్యాదపూర్వకంగా మెలుగుతూ వారికి న్యాయం అందేలా చూడాలని సూచించారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి, డీజీపీ గౌతమ్ సవాంగ్ ఆదేశాల మేరకు జిల్లాలో నేరాల నియంత్రణకు పటిష్టమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ విశాల్ గున్నీ వెల్లడించారు.