అనపర్తి మాజీ ఎమ్మెల్యే మృతిపై సీఎం సంతాపం - tetali ramareddy
తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మాజీ ఎమ్మెల్యే తేతలి రామారెడ్డి అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన మృతిపై సీఎం జగన్ సంతాపం వ్యక్తం చేశారు.

అనపర్తి మాజీ ఎమ్మెల్యే కన్నుమూత... సీఎం సంతాపం వ్యక్తం
తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మాజీ ఎమ్మెల్యే తేతలి రామారెడ్డి కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడిన ఆయన ఇవాళ మధ్యాహ్నం స్వగృహంలో తుది శ్వాస విడిచారు. రామారెడ్డి మృతి పట్ల ముఖ్యమంత్రి జగన్ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థించారు.