ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పంచాయతీ నోటీసు బోర్డులో.. దెబ్బతిన్న పంటల వివరాలు - అమలాపురం డివిజన్​లో పంట నష్టం వివరాలు

తూర్పుగోదావరి జిల్లా సబ్​ కలెక్టర్ హిమాన్షు స్థానిక పంటలను పరిశీలించారు. వర్షాలకు దెబ్బ తిన్న పంట వివరాలను నోటీసు బోర్డులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. రైతుల నుంచి ఎలాంటి అభ్యంతరాలు వచ్చినా వాటిపై తక్షణం స్పందిస్తామని స్పష్టం చేశారు.

east godavari sub collector inspecting crops
దెబ్బతిన్న పంట వివరాలు

By

Published : Oct 24, 2020, 8:58 PM IST

దెబ్బతిన్న పంటను పరిశీలిస్తున్న సబ్ కలెక్టర్

భారీ వర్షాల కారణంగా అమలాపురం డివిజన్​లో జరిగిన పంట నష్టం వివరాలను నోటీసు బోర్డులో ప్రదర్శించాలని సబ్ కలెక్టర్ హిమాన్షు కౌశిక్ అధికారులను ఆదేశించారు. తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట మండలంలో నీటమునిగిన పంటలను ఆయన పరిశీలించారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదుల పరిష్కారం, పెండింగ్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. సకాలంలో సమస్యలను పరిష్కరించాలని సచివాలయ సిబ్బందిని ఆదేశించారు.

ఎప్పటికప్పుడు దెబ్బతిన్న పంట వివరాలను నోటీసు బోర్డులో పెట్టడమే కాకుండా వాటిపై సోషల్ ఆడిట్ నిర్వహిస్తామని సబ్ కలెక్టర్ తెలిపారు. రైతుల నుంచి ఎలాంటి అభ్యంతరాలు వచ్చినా వాటిపై తక్షణం స్పందిస్తామన్నారు.

ఇదీ చదవండి:రెండుసార్లు వేలిముద్ర వేయాలన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి: డీలర్లు

ABOUT THE AUTHOR

...view details