ప్రజలకు సేవలందించడం, ప్రభుత్వ పథకాలను అర్హులైన లబ్ధిదారులకు చేరేలా చేయడం, సమస్యలు సకాలంలో పరిష్కరించడంలో తూర్పుగోదావరి జిల్లా తుని కొండవారిపేట 1వ సచివాలయం రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచి అవార్డు అందుకుంది. గాంధీ జయంతి సందర్భంగా కాకినాడలో జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి చేతుల మీదుగా ఇక్కడి ఉద్యోగులు అవార్డు అందుకున్నారు. వచ్చిన ఆర్జీల్లో 86.73 శాతం పరిష్కరించి అధికారుల ప్రశంసలు అందుకున్నారు. ప్రణాళిక, ఉద్యోగుల్లో ఐకమత్యం కారణంగా ఇదంతా సాధ్యమవుతుందని సచివాలయ సిబ్బంది తెలిపారు.
ప్రభుత్వ పథకాలను లబ్ధిదారులకు చేరవేయటంలో వారు ఫస్ట్ - తూర్పుగోదావరికి మొదటి స్థానం
ప్రజలకు సేవలందించడం, ప్రభుత్వ పథకాలను అర్హులైన లబ్ధిదారులకు చేరేలా చేయడంలో... తూర్పుగోదావరి జిల్లా తుని కొండవారిపేట 1వ సచివాలయం మొదటి స్థానంలో నిలిచింది.
ప్రభుత్వ పథకాలు లబ్ధిదారులకు చేరవేయటంలో జిల్లాకు మొదటి స్థానం