ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విడుదల కాని కాజ్​వేల నిధులు... లంక గ్రామాలకు తప్పని అవస్థలు - పి గన్నవరం నియోజకవర్గం లంక గ్రామాల తాజా వార్తల

కాజ్​వేలకు నిధులు మంజూరు కాక లంక గ్రామాల ప్రజలకు వరదల సమయంలో అవస్థలు పడుతున్నారు. గతేడాది ఆగుస్టులో మంత్రి విశ్వరూప్​ ట్రాక్టర్​పై వెళ్లి ప్రజల కష్టాలను కళ్లారా చూశారు. కాజ్​వేలు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికీ నిధులు మంజూరు కాలేదు. ఇప్పటికైనా అధికారులు, పాలకులు తమ గోడు వినాలని విజ్ఞప్తి చేస్తున్నారిక్కడి ప్రజలు.

east godavari rivers based land living people suffering for no cause way and asking officers to build it
గతేడాది ఆగస్టులో వచ్చిన వరదలప్పడు ట్రాక్టర్​లో వెళ్లి గ్రామస్థులను పరామర్శించిన మంత్రి విశ్వరూప్​

By

Published : Jul 9, 2020, 12:38 PM IST

తూర్పుగోదావరి జిల్లా పి గన్నవరం నియోజకవర్గంలో నాలుగు చోట్ల కాజ్​ వేలు నిర్మించేందుకు గత ప్రభుత్వం 100 కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు చేసింది. అవి మంజూరు కాక లంక గ్రామాల ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. పి గన్నవరం నియోజకవర్గంలో ముక్తేశ్వరం, కె ఏనుగుపల్లి, లంక శివాయి, లంక అప్పనపల్లి నాలుగు చోట్ల కాజు వేలు లేకపోడవం వల్ల వరదల సమయంలో బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోతున్నాయి.

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేరక సమస్య తీరడం లేదు. మళ్ళీ వరదల కాలం వచ్చేసింది. ప్రజల కష్టాలు మళ్ళీ మొదలవుతున్నాయి. గతేడాది ఆగస్టులో వచ్చిన ఉద్ధృత వరదలకు మంత్రి విశ్వరూప్ శివాయ లంక గ్రామానికి ట్రాక్టర్​లో వెళ్లి ఆ గ్రామ ప్రజలను పరామర్శించారు. తప్పకుండా కాజ్​వే నిర్మిస్తామని హామీ ఇచ్చారు. కానీ నేటికీ నిధులు మంజూరు కాలేదు. నాలుగు చోట్ల కాజల్ వేలు నిర్మించేందుకు ఇప్పటికైనా పాలకులు, అధికారులు చొరవ చూపాలని ఆయా గ్రామాల ప్రజలు మొరపెట్టుకుంటున్నారు.

ABOUT THE AUTHOR

...view details