PILGRIMS BOAT OVERTURNED AT GANGA RIVER IB VARANASI : ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి వద్ద గంగా నదిలో పడవ బోల్తా పడింది. ఈ ఘటనలో తూర్పుగోదావరికి చెందిన 34 మంది యాత్రికులు ప్రాణాలతో బయటపడ్డారు. దశాశ్వమేధ ఘాట్ ఎదురుగా ఈ ఘటన చోటుచేసుకుంది. అప్రమత్తమైన అధికారులు గజ ఈతగాళ్లు, బోటు డ్రైవర్ల సహాయంతో యాత్రికులను రక్షించి.. సహాయక చర్యలు చేపట్టారు.
వారణాసి వద్ద గంగానదిలో పడవ బోల్తా.. తూ.గో జి యాత్రికులకు తప్పిన ప్రమాదం - గంగా నదిలో పడవ బోల్తా
BOAT OVERTURNED AT VARANASI : వారణాసి వద్ద గంగా నదిలో తూర్పుగోదావరికి చెందిన 34 మంది యాత్రికులు ప్రయాణిస్తున్న పడవ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో యాత్రికులకు ప్రాణాప్రాయం తప్పింది.

BOAT OVERTURNED AT VARANASI
అందులో అనారోగ్యంతో ఉన్న ఇద్దరు యాత్రికులు బయటికి వచ్చిన తర్వాత అస్వస్థతకు గురయ్యారు. వారిని కబీర్‌చౌరాలోని డివిజనల్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నది మధ్యలోకి వచ్చిన తర్వాత బోటు నీటితో నిండిపోతోందని సుమన్ అనే యాత్రికుడు చెప్పటంతో తోటి యాత్రికులు ఆందోళన చెందారు. దీంతో తోపులాట జరగడంతో భయభ్రాంతులకు గురైన కొందరు నదిలోకి దూకారు.
ఇవీ చదవండి: