ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'కాలానుగుణ వ్యాధులతో ప్రజల అవస్థలు'

తూర్పుగోదావరి జిల్లావాసులను కాలానుగుణ వ్యాధులు వెంటాడుతున్నాయి. గతేడాది 204 డెంగీ కేసులు ఇక్కడ నమోదయ్యాయి. వ్యాధి తీవ్రత ఎక్కువ ఉన్న ప్రాంతాలను బ్లాక్‌స్పాట్‌లుగా అధికారులు గుర్తించారు. ఆ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని నిర్ణయించారు.

seasonal-deceases

By

Published : Jul 26, 2019, 4:25 PM IST

'కాలానుగుణ వ్యాధులతో ప్రజల అవస్థలు'

రాష్ట్రంలో ఎక్కువ జనాభా ఉన్న తూర్పుగోదావరి జిల్లాలో ఏటా డెంగీ,మలేరియా వ్యాధులు సోకుతుంటాయి.అధికారులు మాత్రం ప్రమాదం ముంచుకొచ్చేవరకూ చర్యలకు చేపట్టకపోవటంపై ఆందోళన వ్యక్తమవుతోంది.జిల్లాలో గతేడాది డెంగీ పాజిటివ్ కేసులు నమోదైన50ప్రాంతాలను బ్లాక్ స్పాట్లుగా అధికారులు గుర్తించారు.వీటిలో ఎక్కువ కాకినాడ డివిజన్‌లోనే ఉన్నాయి.కాకినాడ నగరపాలక సంస్థ పరిధిలో గతేడాది91డెంగీ కేసులు నమోదయ్యాయి.కాకినాడ గ్రామీణంలో92డెంగీ కేసులు నమోదయ్యాయి.పిఠాపురం,సామర్లకోట,మండపేట,తుని,రాజమహేంద్రవరం పరిధిలో మిగిలిన కేసులు నమోదయ్యాయి.ఈ ఏడాదీ ఆయా ప్రాంతాల్లో పారిశుద్ధ్యం లోపించిన పరిస్థితులు కనిపిస్తున్నా....అధికారులు మాత్రం చర్యలు ప్రారంభించ లేదు.మురుగునీరు పొంగిపొర్లి ఇంట్లోకి వస్తోందని స్థానికులు ఆవేదన చెందుతున్నారు.

సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రజలకు అవగాహన కల్పించేందుకు అంగన్‌వాడీ,ఆశ వర్కర్లు,ఏఎన్​ఎంలతో బృందాలు ఏర్పాటు చేశారు.సంచార మలేరియా,డెంగీ క్లినిక్‌లు ఏర్పాటు చేసినట్లు అధికారులు చెప్పారు.

బ్లాక్ స్పాట్లుగా గుర్తించిన ప్రాంతాల్లో ప్రత్యేక పారిశుద్ధ్య పనులు చేపట్టాలని కలెక్టర్ మురళీధర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. విషజ్వరాలపై ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని నిర్దేశించారు.

ABOUT THE AUTHOR

...view details