తూర్పుగోదావరి జిల్లా కాకినాడ కలెక్టరేట్‌లో అధికారులు, రైస్ మిల్లర్లతో సంయుక్త కలెక్టర్ లక్ష్మీశ సమావేశం నిర్వహించారు. ఇప్పటి వరకు 3.52 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించారని, రైతులు పండించిన ధాన్యాన్ని నూరుశాతం కొనుగోలు చేయడానికి తక్షణం చర్యలు చేపట్టాలన్నారు. డివిజన్ స్థాయిలో పీపీసీ నిర్వాహకులు, రైస్ మిల్లర్లు, అధికారులతో సమన్వయ సమావేశాలు నిర్వహించాలని సూచించారు. మిల్లర్లు సీఎంఆర్ ఎప్పటికప్పుడు ఇవ్వాలని ఆదేశించారు. సమావేశంలో పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజరు లక్ష్మీరెడ్డి, డీఎస్‌వో ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు.
రబీ దిగుబడిలో లక్ష్యసాధన