తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గాన్ని అభివృద్ధి పనుల నిర్మాణంలో మొదటి స్థానంలో నిలపాలని జాయింట్ కలెక్టర్ జీ. రాజకుమారి అన్నారు. నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు, అధికారులు పాల్గొన్నారు.
'భవన నిర్మాణాల్లో నియోజకవర్గాన్ని మొదటిస్థానంలో నిలపాలి' - తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ రాజకుమారి వార్తలు
తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటలో జాయింట్ కలెక్టర్ రాజకుమారి అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. భవన నిర్మాణాల్లో నియోజకవర్గాన్ని మొదటి స్థానంలో నిలపాలని అధికారులకు సూచించారు.
కలెక్టర్ సమీక్ష
జేసీ మాట్లాడుతూ.. జిల్లాలో భవన నిర్మాణాలలో నాలుగో స్థానంలో ఉందన్నారు. పనులు త్వరితగతిన పూర్తిచేయాలని సూచించారు. 4 మండలాల్లో సచివాలయాలు, హెల్త్ క్లినిక్లు, రైతు భరోసా కేంద్రాలు మంజూరయ్యాయని తెలిపారు. ఇసుక, సిమెంట్ కొరతతో నిర్మాణాలు ఆలస్యమవుతున్నాయని ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీలు జేసీ దృష్టికి తీసుకువచ్చారు. ఈ సమస్యలు అధిగమించడానికి ప్రభుత్వ యంత్రాంగం చర్యలు తీసుకుంటుందని జేసీ తెలిపారు. అందరూ సమన్వయంతో పనిచేసి పనులు వెంటనే పూర్తిచేయాలని ఆదేశించారు.