ఈనెల 16న తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా ఏర్పాట్ల పురోగతిపై జాయింట్ కలెక్టర్ ఆరా తీశారు. అవసరమైన అన్ని ఏర్పాట్లను శరవేగంగా పూర్తి చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ కీర్తి చేకూరి అధికారులను ఆదేశించారు. అక్కడ జరుగుతున్న ఏర్పాట్లను ఆమె పరిశీలించారు. సీఎం పర్యటన ఆర్గనైజింగ్ టీం సభ్యులు పి.గన్నవరంలో జరుగుతున్న హెలిప్యాడ్, విఐపీ వెహికల్స్ పార్కింగ్, సభాస్థలి.. తదితర ప్రదేశాలను పరిశీలించారు.
సీఎం పర్యటన పనులను జాయింట్ కలెక్టర్ పరిశీలన - cm jagan
ఈనెల 16న తూర్పు గోదావరిలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటన పనులను జేసీ పర్యవేక్షించారు. ఏర్పాట్లను శరవేగంగా పూర్తి చేయాలని ఆమె అధికారులను ఆదేశించారు.
జాయింట్ కలెక్టర్ పరిశీలన