ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నత్తనడకన విద్యుత్ పునరుద్దరణ పనులు - ఏలేశ్వరం మండలం

ఫొని తుపాను ప్రభావంతో వీచిన గాలులతో ఏలేశ్వరం మండలంలోని పలు చోట్ల విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. ఇప్పటికీ వాటిని పునరుద్ధరించకపోవటంతో కరెంట్ లేక ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు.

'విద్యుత్ స్తంభాలు నేలకొరిగి వారమైనా పట్టించుకోని అధికారులు'

By

Published : May 13, 2019, 9:13 PM IST

నత్తనడకన విద్యుత్ పునరుద్దరణ పనులు

తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరం మండలంలో విద్యుత్ కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. వారం రోజుల క్రిందట వేగంగా వీచిన గాలులకు విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. ఇప్పటికీ వాటి పునరుద్ధరణ చర్యలు చేపట్టలేదు. ఫలితంగా చాలా గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. గ్రామాల్లో తీవ్ర నీటి ఎద్దడి ఉండటం... మంచినీటికి సైతం విద్యుత్ మోటార్లతో ఆధారపడటం వల్ల గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details