తూర్పుగోదావరి జిల్లా తుని ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిలో రెండు రోజులుగా కరోనా పరీక్షలు నిలిపివేశారు. ఆసుపత్రిలో ఈ నెల 20న కరోనా పరీక్షా కేంద్రాన్ని ప్రారంభించారు. రోజుకు 150 మందికి పరీక్షలు చేసే విధంగా ఏర్పాట్లు చేశారు. అయితే కిట్లు అందుబాటులో లేకపోవటంతో తాత్కాలికంగా పరీక్షలు నిలుపుదల చేశారు. పరీక్షలు చేయించుకునేందుకు వచ్చిన చాలా మంది వెనుదిరుగుతున్నారు.
తునిలో కరోనా కిట్ల కొరత.. పరీక్షలు నిలిపివేత - covid news in east godavari dst
తూర్పుగోదావరి జిల్లా తుని ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిలో కరోనా పరీక్ష కిట్లు అందుబాటులో లేవని అధికారులు పరీక్షలు నిలిపివేశారు.
east godavari dst thuni govt hospital due to no corona kits stop the corona tests