‘ఉన్నతోద్యోగం పొంది కుటుంబానికి అండగా ఉంటాడనుకున్నాం. ఈలోపే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడ’ని ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరానికి చెందిన కొల్లి శ్రీనివాస తేజస్విరెడ్డి (26) చదువుకోవడానికి కెనడాలోని కిచినార్ నగరానికి నాలుగేళ్ల కిందట వెళ్లారు. ప్రస్తుతం ఉద్యోగాన్వేషణలో ఉన్నారు. స్థానికంగా ఉన్న ఓ సరస్సులో తన స్నేహితులతో కలిసి తేజస్విరెడ్డి స్నానానికి వెళ్లారు. నీటిలో చిక్కుకున్న మిత్రుడిని కాపాడే ప్రయత్నంలో తేజస్విరెడ్డి చనిపోయారు. విషయం తెలుసుకున్న తండ్రి శ్రీనివాసరెడ్డి, తల్లి మాధవి, సోదరి మానస బోరున విలపించారు. కడసారి చూపుకైనా తమ కుమారుడి మృతదేహాన్ని ఇక్కడికి తీసుకొచ్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించాలని వారు కోరుతున్నారు.
కెనడాలో తెలుగు విద్యార్థి మృతి - east godavari dst taja student death news
తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరానికి చెందిన కొల్లి శ్రీనివాస తేజస్విరెడ్డి (26) కెనాడాలో చనిపోయాడు. సరస్సులో స్నేహితులతో కలిసి స్నానానికి వెళ్లిన తేజస్విరెడ్డి నీటిలో చిక్కుకున్న మిత్రుడిని కాపాడే ప్రయత్నంలో చనిపోయారు. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు బోరున విలపిస్తున్నారు.

east godavari dst student died in kenada due to reuse his friend sucked in water