కరోనా వైరస్ ప్రభావం రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో సరకుల పంపిణీకి బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయడం తగదని తూర్పుగోదావరి జిల్లా రేషన్ డీలర్లు ఆందోళన వ్యక్తం చేశారు. రెండో విడతగా ఇచ్చిన ఉచిత వస్తువుల పంపిణీని.. బయోమెట్రిక్ విధానం లేకుండా ప్రభుత్వం జారీ చేసిన కూపన్లతో ఇచ్చిన కారణంగా.. ఎలాంటి ప్రమాదం జరగలేదన్నారు.
మళ్లీ ఈ-పాస్ తో బయోమెట్రిక్ అమలు చేస్తే కరోనా వైరస్ సోకే అవకాశముందని డీలర్లు వాపోతున్నారు. ఇది తమ ప్రాణాల మీదకు తెచ్చేలా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. మండలం డీలర్ల సంఘం అసోసియేషన్ చైర్మన్ సూరపురెడ్డి గోపాలకృష్ణ ఆధ్వర్యంలో డీలర్లు స్థానిక మండల తహసిల్దార్ జవ్వాది వెంకటేశ్వరికి తమ సమస్యను వివరించారు.