ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'మరపడవల్లో భౌతికదూరం తప్పనిసరి' - east godavari dst lanka villages

తూర్పుగోదావరి జిల్లా లంకగ్రామాలను ఆర్డీవో భవాని శంకర్ సందర్శించారు. వరద తాకిడికి గురయ్యే మండలాల్లో సహాయక చర్యలు చేపట్టామని తెలిపారు. రాకపోకలు సాగించే ప్రజలు మర పడవల్లో భౌతిక దూరం పాటించి ప్రయాణించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

east godavari  dst p.gannavaram  rdo  visits lanka villages
east godavari dst p.gannavaram rdo visits lanka villages

By

Published : Jul 11, 2020, 7:54 PM IST

తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం నియోజకవర్గంలోని బూరుగులంక రేవును ఆర్డీవో భవాని శంకర్ సందర్శించారు. కోనసీమలో ఉప్పలగుప్తం మండలం మినహా మిగిలిన 15 మండలాలు గోదావరి వరద తాకిడికి గురవుతాయని ఆయన వెల్లడించారు. కరోనా కారణంగా లంక గ్రామాల నుంచి రాకపోకలు సాగించే ప్రజలు మర పడవల్లో భౌతికదూరం పాటించి ప్రయాణించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

ఈ మేరకు రేవులో మర పడవలను గత ఏడాది కంటే ఎక్కువగా అందుబాటులోకి తెస్తామని తెలిపారు. వరదలు ఎదుర్కొనేందుకు పూర్తి సన్నద్ధతతో ఉన్నామని ఆర్డీవో వెల్లడించారు. రేవులు దాటే సమయంలో ప్రజలు తప్పనిసరిగా లైఫ్ జాకెట్లు ధరించాలన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఇదీ చూడండి

ఒకటే వేదిక.. వరుడొక్కడు.. వధువులిద్దరు!

ABOUT THE AUTHOR

...view details