తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వ్యాపారస్థులు స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేశారు. కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు నియోజకవర్గంలోని రావులపాలెం, కొత్తపేట, ఆలమూరు మండలాల్లో.. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకే వ్యాపారాలు నిర్వహిస్తామని నిర్ణయించారు. అధికారులు తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ఇదే విధానాన్ని కొనసాగిస్తామని వెల్లడించారు.
ఇకపై దుకాణాలన్నీ మధ్యాహ్నం రెండు గంటలకే బంద్! - east godavari dst latest news
తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండటంపై.. వ్యాపారస్థులు అప్రమత్తమయ్యారు. దుకాణాలను మధ్యాహ్నం వరకే తెరిచి ఉంచాలని నిర్ణయించుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే పిలుపు మేరకు కరోనా నియంత్రణలో భాగంగా తమవంతు కృషి చేస్తామని వ్యాపారస్థులు తెలిపారు.
east godavari dst kotthapeta consistency all shop close before two in the afternoon