తూర్పుగోదావరి జిల్లా కొత్తపల్లి మండలంలోని ఉప్పాడ చేపలరేవు రెండు రోజులుగా జన సంచారంతో తిరనాళ్లను తలపిస్తోంది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఇక్కడ పరిస్థితి ఆందోళనకు గురిచేస్తుంది. రోజూ వందల సంఖ్యలో మత్స్యకారులు, వ్యాపారులు రేవులోకి చేరుకుంటున్నారు. కానీ ఎవరూ లాక్ డౌన్ నిబంధనలు పాటించటం లేదు. చేపలు ఎగుమతి కోసం ఇక్కడకు కర్ణాటక, కేరళ,మహారాష్ట్ర తదితర రాష్ట్రాల నుంచి పదుల సంఖ్యలో భారీ వాహనాలు వస్తున్నాయి. అధికారులు సత్వర చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
కరోనా వేళ... ఇంత రద్దీ ఏల..! - corona cases in east godavari dst
రాష్ట్రంలో ఓ పక్క కరోనా వైరస్ విజృంభిస్తుంటే తూర్పుగోదావరి జిల్లా కొత్తపల్లి మండలంలోని ఉప్పాడ చేపల చెరువులో మాత్రం వందల సంఖ్యలో జనాలు తిరుగుతున్నారు. లాక్ డౌన్ నిబంధనలు పాటించకుండా గుంపులు గుంపులుగా చేరుతున్నారు.
east godavari dst kotthapalli mandal upada fish market rush