ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పారిశుద్ధ్య పనులపై పూర్తి వివరణ ఇవ్వండి - east godavari dst tdp politics

పారిశుద్ధ్య పనుల్లో భాగంగా గ్రామంలో చేపట్టిన పనులపై పూర్తి వివరణ ఇవ్వాలని తెదేపా మాజీఎమ్మెల్యే వర్మ డిమాండ్ చేశారు. తూర్పుగోదావరి జిల్లాలో ఎలాంటి పారిశుద్ధ్య పనులు చేయకపోయినా... బిల్లులు చేసుకుంటున్నారని ఆరోపించారు.

east godavari dst kakinada ex mla comments on works done for corona sanitation
east godavari dst kakinada ex mla comments on works done for corona sanitation

By

Published : May 29, 2020, 8:56 PM IST

కరోనా లాక్‌డౌన్‌ సమయంలో పారిశుద్ధ్య నిర్వహణకు వినియోగించిన బ్లీచింగ్‌, ముగ్గు, సోడియం హైపోక్లోరేట్‌ కొనుగోలుపై పూర్తిస్థాయి విచారణ జరపాలని పిఠాపురం మాజీఎమ్మెల్యే వర్మ డిమాండ్‌ చేశారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని జిల్లా తెదేపా కార్యాలయంలో మాట్లాడిన ఆయన... చాలా గ్రామాల్లో ఎలాంటి పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టకపోయినా బిల్లులు చేసుకున్నారని ఆరోపించారు. గ్రామాల్లో చల్లింది ముగ్గా... బ్లీచింగ్ పౌడరా అన్నది నిగ్గు తేల్చాలని డిమాండ్‌ చేశారు.

ABOUT THE AUTHOR

...view details