ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు గోదావరికి వరద నీరు చేరుతుంది. తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం బ్యారేజీ నుంచి దిగువకు నీరు విడుదల చేయటంతో రావులపాలెంలోని గౌతమీ వంతెన వద్ద గోదావరి పరవళ్లు తొక్కుతుంది. ఇసుక ర్యాంపులోని బాటలు సైతం వరద నీటి ప్రవాహానికి కొట్టుకుపోయాయి. ప్రస్తుతం ప్రభుత్వ స్థలాల్లోకి బొండు ఇసుకను తరలిస్తున్నారు. ఈ ప్రాంతాలన్నీ నీటితో మునిగిపోవటంతో బొండు ఇసుక తవ్వకాలు నిలిచిపోయాయి. గోదావరికి వరద నీరు మరింత చేరితే లంక పొలాలకు వచ్చే అవకాశం ఉంది.
గౌతమీ వంతెన వద్ద గోదావరి పరవళ్లు - latest news of godavari rivers water
తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం బ్యారేజీ నుంచి గోదావరిలోకి నీరు విడుదల చేయటంతో... గౌతమీ వంతెన వద్ద గోదావరి పరవళ్లు తొక్కుతుంది. వరద నీరు మరింత చేరితే లంక పొలాలకు వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

east godavari dst godavari water flow increases