ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నారు'

తమిళనాడులో శ్రీవారి ఆస్తులను ప్రభుత్వం అమ్మకానికి పెట్టడాన్ని తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

east godavari dst anaparhi ex mla ramakrishan reddy fired on selling of ttd assets
east godavari dst anaparhi ex mla ramakrishan reddy fired on selling of ttd assets

By

Published : May 23, 2020, 10:08 PM IST

తితిదే ఆస్తుల విక్రయం, శ్రీవారి లడ్డు అమ్మకాలపై తితిదే నిర్ణయాన్ని తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి తప్పుబట్టారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్తుల విక్రయానికి తితిదే పాలకమండలి నిర్ణయం తీసుకుని గోప్యంగా ఉంచిందని ఆరోపించారు.

తమిళనాడులో 23 ఆస్తులను అమ్మకానికి పెట్టిందని... ఆ దిశగా రెండు అధికార బృందాలను ఏర్పాటు చేసిందన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం స్వామి వారి ఆస్తులను అమ్మకానికి పెట్టటం దుర్మార్గపు చర్యని మండిపడ్డారు.

తితిదే ధర్మకర్తల మండలి ప్రభుత్వ నిర్ణయాలనే కాకుండా ప్రజల అభిప్రాయం, భక్తుల మనోభావాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వం వెంటనే ఈ చర్యలను వెనక్కు తీసుకుని తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్తులను కాపాడాలని విజ్ఞప్తి చేశారు.

ఇదీ చూడండిసోమవారం రాష్ట్రానికి రానున్న చంద్రబాబునాయుడు

ABOUT THE AUTHOR

...view details