తూర్పుగోదావరి జిల్లా సీతానగరం శిరోముండనం బాధితుడు ప్రసాద్‌తో స్థానిక పెద్దలు గొడవపడిన దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. గత శనివారం రాత్రి మునికూడలి వద్ద స్థానిక వైకాపా నాయకుడు కారు తలుపుతో ఢీకొట్టడంతో తన నోటికి గాయమైందని బాధితుడు ప్రసాద్ తెలిపాడు. ఆ ఘటనలో ప్రసాద్ స్నేహితులు, స్థానిక వైకాపా నాయకులు చీకట్లో గొడవపడిన దృశ్యాలు బయటకు వచ్చాయి. ప్రసాద్ గాయపడటంతో అతని స్నేహితులు ఆగ్రహంతో తన కారుపై దాడి చేశారని స్థానిక వైకాపా నాయకుడు కవల కృష్ణమూర్తి సీతానగరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఎస్సై ఫిరోజ్ ఆధ్వర్యంలో స్టేషన్‌కు తీసుకెళ్లి ప్రసాద్‌కు శిరోముండనం చేయడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కల్గించింది.
శిరోముండనం చేసిన యువకుడిని.. ఆ రోజు రాత్రి ఇలా కొట్టారా? - police tonsure to sc person news
తూర్పుగోదావరి జిల్లా సీతానగరం పోలీసులు ఓ ఎస్సీ యువకుడిని అరెస్టు చేసి... శిరోముండనం చేయించిన ఘటన మెున్న రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది. తప్పును ప్రశ్నించినందుకు.. ఆ యువకుడిని చిత్రహింసలు పెట్టిన విషయం తెలిసిందే..
![శిరోముండనం చేసిన యువకుడిని.. ఆ రోజు రాత్రి ఇలా కొట్టారా? east godavari district sithanagaram tonsured incident video](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8168546-652-8168546-1595672221303.jpg)
east godavari district sithanagaram tonsured incident video
శిరోముండనం చేసిన యువకుడిని.. ఆ రోజు రాత్రి ఇలా కొట్టారా?
Last Updated : Jul 26, 2020, 10:44 PM IST