భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన నెల్లురులోని శ్రీహరికోట రాకెట్ కేంద్రం నుంచి గురువారం పీఎస్ఎల్వీ-సి50 వాహకనౌక ద్వారా పంపిన సీఎంఎస్-01 కమ్యూనికేషన్ ఉపగ్రహానికి కాకినాడకు చెందిన కేవీఎస్ భాస్కర్ సంచాలకుడిగా వ్యవహరించారు.ఆయన సారథ్యంలోనే ఈ ఉపగ్రహ రూపకల్పన జరిగింది. ఈ ఉపగ్రహాన్ని జియో స్టేషనరి ఆర్బిట్లో శాస్త్రవేత్తలు ప్రవేశపెట్టారు. ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ చేసిన కేవీఎస్ భాస్కర్ బెంగళూరులోని ఇస్రో కేంద్రంలో ఉద్యోగంలో చేరారు. ప్రస్తుతం యూఆర్రావు శాటిలైట్ సెంటర్లో విధులు నిర్వహిస్తున్నారు.
సీఎంఎస్-01 ఉపగ్రహ సంచాలకుడిగా తూర్పు గోదావరి జిల్లా వాసి - isro
శ్రీహరికోట నుంచి గురువారం పంపిన సీఎంఎస్-01 ఉపగ్రహానికి సంచాలకుడిగా వ్యవహరించిన కేవీఎస్ భాస్కర్ కాకినాడకు చెందిన వారే. ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ చేసి బెంగళూరులోని ఇస్రోలో ఉద్యోగంలో చేరిన ఆయన ప్రస్తుతం యూఆర్రావు శాటిలైట్ సెంటర్లో విధులు నిర్వహిస్తున్నారు.
భాస్కర్