ద్విచక్రవాహనాలు ఎత్తుకెళ్తూ... చిక్కకుండా తిరుగుతున్న వ్యక్తిని అరెస్టు చేసినట్లు అమలాపురం డీఎస్పీ షేక్ బాషా తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా గోపాలపురం మండలం తొక్కిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన... గుర్రం కృష్ణ చాలా ఏళ్లుగా దొంగతనాలు చేస్తున్నాడు. గోపాలపురం, కొయ్యలగూడెం, నల్లజర్ల, జంగారెడ్డిగూడెం, గణపవరం, తాళ్ళరేవు, దేవరపల్లి గ్రామాల్లో టీవీఎస్ ఎక్స్ఎల్ మోటార్ సైకిళ్ళు దొంగతనాలు చేశాడని డీఎస్పీ వివరించారు.
వరుస చోరీలకు పాల్పడిన వ్యక్తి అరెస్టు - వరుస చోరీలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్టు
ద్విచక్రవాహనాలు చోరీ చేస్తున్న వ్యక్తిని తూర్పుగోదావరి జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. అతని నుంచి 16 బైక్లు స్వాధీనం చేసుకున్నారు.
![వరుస చోరీలకు పాల్పడిన వ్యక్తి అరెస్టు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5048208-419-5048208-1573631848437.jpg)
వరుస చోరీలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్టు
వరుస చోరీలకు పాల్పడిన వ్యక్తి అరెస్టు
ఆయా పోలీస్స్టేషన్లలో ఇతనిపై 80 కేసులు వరకు నమోదయ్యాయని చెప్పారు. పలు కేసుల్లో జైలు శిక్ష కూడా అనుభవించాడన్నారు. రావులపాలెం పరిధిలో 13, పశ్చిమగోదావరి జిల్లాలోని ఇరగవరం, నిడమర్రు పరిధిలో 3 మోటార్ సైకిళ్ళు దొంగతనం చేశాడని డీఎస్పీ వివరించారు. రావులపాడు గ్రామం వద్ద తనిఖీలు చేస్తుండగా... ఇతన్ని పట్టుకున్నామని చెప్పారు. అరెస్టు చేసి అతని నుంచి 16 మోటార్ సైకిళ్లు స్వాధీనం చేసుకున్నామన్నారు.
ఇవీ చదవండి...నలుగురు దోపిడీ దొంగల అరెస్టు