తూర్పు గోదావరి జిల్లాలో కరోనా పాజిటివ్ కేసు నమోదు కావడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. రాజమహేంద్రవరానికి చెందిన 22 ఏళ్ల ఎంబీఏ విద్యార్థికి కరోనా నిర్ధరణ కావడంతో కాకినాడ జీజీహెచ్‌లోని ఐసోలేషన్ వార్డులో ఉంచి ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు. కరోనా పాజిటివ్ వచ్చిన యువకుని తల్లిదండ్రులను, ఎనిమిది మంది స్నేహితులను కాకినాడలోని జీజీహెచ్‌కు తరలించి ప్రత్యేక వైద్యపరీక్షలు నిర్వహిస్తున్నారు. వీరిలో అనుమానిత లక్షణాలు కనిపిస్తే, ఐసోలేషన్ వార్డులో చికిత్స అందిస్తామనీ, లేకపోతే రాజమహేంద్రవరంలో స్వీయ నిర్బంధంలో వైద్యుల పర్యవేక్షణలో ఉంచనున్నట్లు జీజీహెచ్ సూపరింటెండెంట్ ఎం. రాఘవేంద్రరావు వివరించారు. ఇప్పటికే పది అనుమానిత కేసులను పర్యవేక్షణలో ఉంచారనీ, అందులో ఒకరికి కరోనా నిర్ధరణ అయినట్లు వెల్లడించారు. మిగిలిన ఫలితాలు వెల్లడికావల్సి ఉందని తెలిపారు. దగ్గు, జలుబు, జ్వరం వంటి లక్షణాలు ఉంటే, వైద్యులను సంప్రదించాలని కోరారు.
'మనల్ని మనం కాపాడుకుందాం... దేశాన్ని కాపాడుదాం' - corona patient in kakinada ggh
తూర్పు గోదావరి జిల్లాలో ఓ యువకుడికి కరోనా నిర్ధరణ కావటంతో జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. యువకుడిని కాకినాడ జీజీహెచ్‌లో ఉంచి ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు. రోగి తల్లిదండ్రులు, స్నేహితులకు పరీక్షలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.

అప్రమత్తమైన తూర్పు గోదావరి అధికారులు