రెండో దశలో కొవిడ్ వేరియంట్ యువతపై.. ఎక్కువ ప్రభావం చూపుతోందని.. మరణిస్తున్న వారు కూడా 45 ఏళ్ల లోపు వారే ఎక్కువగా ఉంటున్నారని తూర్పుగోదావరి జిల్లా వైద్య సేవల సమన్వకర్త డాక్టర్ రమేష్ కిషోర్ చెబుతున్నారు.
ప్రభుత్వాసుపత్రులకు చివరి నిమిషంలో తీసుకురావడం వల్ల వ్యాధి తీవ్రమై మరణాలు ఎక్కువగా ఉంటున్నాయని అంటున్నారు. వ్యాక్సినేషన్‌పై అపోహలు వీడి ప్రతి ఒక్కరూ టీకా వేసుకునేందుకు ముందుకు రావాలంటున్న డాక్టర్ రమేష్ కిశోర్‌తో ఈటీవీ భారత్ ముఖాముఖి.