తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట ఎస్.ఐ శ్రీను నాయక్‌ను సస్పెండ్ చేస్తూ ఏలూరు రేంజ్ డీఐజీ కె వి మోహనరావు ఉత్తర్వులు జారీ చేశారు. కొత్తపేటకు చెందిన మహ్మద్ అబ్దుల్ ఖాదర్ అనే యువకుడు హత్యకేసులో అక్రమంగా తనని అనుమానితురాలిగా భావించి నిర్బంధించారని గుంటూరుకు చెందిన అక్తర్ రోషన్ అనే గర్భిణి ఆరోపించారు. కొన్ని రోజులపాటు తనతో పాటు బంధువులను అక్రమంగా కొత్తపేట పోలీస్‌స్టేషన్‌లో నిర్బంధించారని మహిళ హైకోర్టులో కార్పస్ పిటీషన్ వేసింది.
Illegal detention case: అక్రమ నిర్బంధం కేసు.. ఎస్ఐ సస్పెండ్.. - Kottapeta SI suspended
అక్రమ నిర్బంధం కేసులో తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట ఎస్ఐ ఎల్.శ్రీనునాయక్ సస్పెన్షన్‌కు గురయ్యారు. ఈ మేరకు ఏలూరు రేంజ్ డీఐజీ మోహనరావు ఉత్తర్వులు జారీ చేశారు.
![Illegal detention case: అక్రమ నిర్బంధం కేసు.. ఎస్ఐ సస్పెండ్.. అక్రమ నిర్బంధం కేసు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-13155887-170-13155887-1632454180994.jpg)
Illegal detention case
ఈ కేసుపై విచారణ చేపట్టాల్సిందిగా అదనపు డీజీ రవిశంకర్ అయ్యర్, ఏలూరు డీఐజీ కెవీ మోహనరావును హైకోర్టు ఆదేశించింది. అక్రమ నిర్బంధం వాస్తవమేనని తేలడంతో.. ఎస్ఐ శ్రీనునాయక్‌ను సస్పెండ్ చేస్తూ డీఐజీ ఉత్తర్వులు జారీ చేశారు. ఇదే కేసులో మరో అధికారిపై కూడా చర్యలకు సిద్ధం అవుతున్నట్లు సమాచారం.
ఇదీ చదవండీ..CLAP program: అక్రమ వసూళ్లకు ‘క్లాప్’ కొట్టారు!
Last Updated : Sep 24, 2021, 12:50 PM IST