తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట పోలీసులు మానవత్వం చాటుకున్నారు. సమయానికి అంబులెన్స్ అందుబాటులో లేనందున.. కరోనా బాధితురాలిని పోలీసు వాహనంలో ఆస్పత్రికి తరలించి ప్రాణం నిలబెట్టారు. కొత్తపేట పోలీస్ స్టేషన్ కు సంబంధించి సబ్ జైల్లో హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న దైవసహాయం, అతని కుటుంబానికి కరోనా సోకింది.
వారు కొన్ని రోజుల నుంచి హోమ్ ఐసోలేషన్ లోనే చికిత్స పొందుతున్నారు. అయితే దైవసహాయం భార్యకు ఆక్సిజన్ లెవెల్స్ పడిపోవడంతో ఆసుపత్రికి తీసుకువెళ్లడానికి అంబులెన్స్ అందుబాటులో లేదు. విషయం తెలుసుకున్న కొత్తపేట ఎస్సై శ్రీనివాస్ నాయక్.. తన జీప్ డ్రైవర్ కు పీపీఈ కిట్ వేయించి తన వాహనంలోనే ఆసుపత్రికి తరలించి మానవత్వం చాటుకున్నారు.