తూర్పుగోదావరి జిల్లా కోనసీమ ప్రాంతానికి చెందిన అబ్బాయిలు, అమ్మాయిలు కర్రసాము శిక్షణవైపు అడుగులేస్తున్నారు. ఇటీవల కడప, పిఠాపురం ప్రాంతాల్లో జాతీయ స్థాయి శీలంబం అసోసియేషన్ నిర్వహించిన పోటీల్లో బంగారు పతకాలు సాధించారు. జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. జాతీయస్థాయిలోనూ బంగారు పతకాలు సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు ఈ విద్యార్థులు.
కర్రసాములో అదరగొడుతున్న కోనసీమ విద్యార్థులు - talent of karrasamu students
ఆత్మరక్షణకు ఉపయోగపడే కర్రసాములో దుమ్మురేపుతున్నారు ఆ విద్యార్థులు. రాష్ట్ర స్థాయిలో బంగారు పతకాలు సాధించి జాతీయ స్థాయికి తర్ఫీదు పొందుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా కోనసీమ ప్రాంతానికి చెందిన ఈ విద్యార్థులు... కర్రసాము చేస్తుంటే కళ్లు ఆర్పకుండా చూడాల్సిందే..!
![కర్రసాములో అదరగొడుతున్న కోనసీమ విద్యార్థులు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5122310-571-5122310-1574245670238.jpg)
కర్రసాములో అదరగొడుతున్న కోనసీమ విద్యార్థులు