తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటలో నిబంధనలు పాటించకుండా ద్విచక్ర వాహనాలపై ప్రయాణిస్తున్న సచివాలయ సిబ్బంది, వాలంటీర్లను స్థానిక సీఐ రాంబాబు తీవ్రంగా హెచ్చరించారు. వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది సైతం నిబంధనలు పాటించాలని కోరారు. అనవసరంగా బయటకు వస్తున్న వారిని పోలీసులు ఇళ్లకు పంపారు. ద్విచక్రవాహనంపై ఒక్కరే ప్రయాణించాలని సీఐ సూచించారు. అనవసరంగా బయటకు రాకూడదని, కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉన్నందున ప్రతి ఒక్కరూ ఇళ్లల్లోనే ఉండాలని విజ్ఞప్తి చేశారు.
'ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాల్సిందే'
రాష్ట్రవ్యాప్తంగా లాక్డౌన్ కఠినంగా అమలవుతోంది. అనవసరంగా రోడ్లపైకి రావద్దని పోలీసులు సూచిస్తున్నారు. ప్రభుత్వ శాఖల్లో విధులు నిర్వర్తిస్తున్న వారిని పోలీసులు అడ్డుకుంటున్నారు. ఇంట్లోనే ఉండి వైరస్ వ్యాప్తి నివారణకు కృషి చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
వాలంటీర్లను హెచ్చరిస్తున్న జగ్గంపేట సీఐ