తూర్పు గోదావరి జిల్లా రౌతులపూడి మండలం జగన్నాధపురం గ్రామంలో ఓ మామ తన అల్లుడు తల నరికి పోలీసులకు లొంగిపోయాడు... ఈ ఘటనపై డీఎస్పి శ్రీనివాసరావు, సీఐ రాంబాబు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి...
కుమార్తె మృతి అనంతరం పిల్లలకు భూమి రాయించిన పెద్దలు
జగన్నాధపురం గ్రామానికి చెందిన సత్యనారాయణ తన కుమార్తెను శంఖవరం మండలం అచ్చంపేటకు చెందిన లచ్చబాబుకు ఇచ్చి 2015లో వివాహం చేశాడు. వీరికి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. సత్యనారాయణ కుమార్తె పది నెలల క్రితం అల్లుడు లచ్చబాబు ఇంటి వద్ద ఉరివేసుకొని మృతి చెందింది. దీనిపై ఫిర్యాదు చేయకుండా పెద్దల సమక్షంలో లచ్చబాబుకు చెందిన 40 సెంట్ల భూమిని పిల్లల పేర్ల మీద రాసి పిల్లలను సత్యనారాయణ ఇంటి వద్ద ఉంచారు.
మద్యం మత్తులో నిజం ఒప్పుకున్న అల్లుడు
అయితే తన కుమార్తెను అల్లుడే చంపాడు అన్న అనుమానం మామ సత్యనారాయణకు ఉంది. ఇదిలా ఉండగా తన కుమార్తె చనిపోయిన తరువాత.. ఇంటికి పిలిచి కొత్త బట్టలు పెట్టాలనే ఉద్దేశంతో అల్లుడికి ఫోన్ చేసి ఇంటికి తీసుకువచ్చాడు. మద్యం మత్తులో తన కుమార్తెను చంపిన విషయాన్ని అల్లుడు ఒప్పుకున్నాడు. మీ బంధువుల్లో ఎవరో ఒకరిని తనకు ఇచ్చి పెళ్ళి చేయాలని కోరాడు. లేదంటే పిల్లల్ని కూడా చంపేస్తానని అల్లుడు బెదిరించాడని సత్యనారాయణ తెలిపాడు. నిజం తెలుకున్న సత్యనారాయణ కోపంతో అల్లుడిని నరికి చంపాడు.
తల తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు వెళ్లిన వైనం
తల, మొండెం వేరు చేసి తలతో అన్నవరం పోలీస్ స్టేషన్‌కు వచ్చి సత్యనారాయణ లొంగిపోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేశామని దర్యాప్తు చేస్తున్నామని డీఎస్పీ వెల్లడించారు.
ఇదీ చూడండి:
కరోనా సోకినా.. మారని దొంగలు