తూర్పు గోదావరి జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల తీవ్రత పెరుగుతోంది. తాజాగా 74 కేసులు నమోదయ్యాయి. మొత్తం కరోనా బాధితుల సంఖ్య 727కు చేరింది. తాజాగా 2 మరణాలు నమోదైనట్లు డీఎంహెచ్‌వో ఎం.మల్లికార్జున్ తెలిపారు. దీంతో యంత్రాంగం అప్రమత్తమైంది.
తూర్పుగోదావరి జిల్లాలో పెరుగుతున్న కరోనా కేసులు - తూర్పుగోదావరిలో కరోనా కేసుల వార్తలు
తూర్పుగోదావరి జిల్లాలో కొత్తగా 74 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 727కు చేరింది. క్వారంటైన్ కేంద్రాల్లో 581 మంది ఉన్నారు.
తూర్పుగోదావరిలో కొత్తగా 4 పాజిటివ్ కేసులు
జిల్లాలో శనివారం 4,436 మంది నుంచి నమూనాలు సేకరించారు. 1,458 నమూనాలను పరీక్షించారు. శనివారం కొత్తగా నమోదైన కేసుల్లో 55 జిల్లాలోనివి.. మిగిలిన 19 పొరుగు ప్రాంతాల నుంచి వచ్చినవారివిగా గుర్తించారు. కొత్తగా 7 కంటైన్మెంట్ క్లస్టర్లు ఏర్పాటు చేశారు. 49 మంది డిశ్చార్జ్ అయ్యారు. హోం ఐసోలేషన్‌కు మరో ఇద్దరికి అవకాశం కల్పించారు. పలు క్వారంటైన్ కేంద్రాల్లో 581 మంది ఉన్నారు
ఇవీ చదవండి.. : కొబ్బరి కాయల లోడులో 664 కేజీల గంజాయి పట్టివేత
Last Updated : Jun 21, 2020, 8:18 PM IST