తూర్పు గోదావరి జిల్లాలో 'నో మాస్క్ నో ఎంట్రీ' విధానాన్ని సమర్ధవంతంగా అమలుచేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ మురళీధర్ రెడ్డి తెలిపారు. కరోనా తీవ్రత దృష్ట్యా పటిష్ట చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ మేరకు యంత్రాంగానికి సూచనలు చేశారు. అవగాహన లేకుండా ప్రజలు నిర్లక్ష్యంగా ఉంటే ప్రమాదం బారిన పడినట్లేనని కలెక్టర్ హెచ్చరించారు. మాస్కు వేసుకుంటేనే దుకాణాల్లోకి గాని, ఇతర కార్యాలయాల్లోకి గాని ప్రవేశం ఉంటుందని స్పష్టం చేశారు.
వ్యాపారులు మాస్కులు వేసుకోకపోయినా.. మాస్కులు వేసుకోని వారిని లోనికి రానిచ్చినా.. ఆయా దుకాణాలను, ప్రాంగణాలను వారం రోజుల పాటు మూసివేస్తామని హెచ్చరించారు. కరోనా వైరస్ నుంచి రక్షణ కల్పించుకోవడం మన చేతుల్లోనే ఉందని జిల్లా ఎస్పీ నయీంఅస్మీ తెలిపారు. అనవసరంగా బయటకు తిరిగి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని హితవు పలికారు.