కొవిడ్ కేర్ సెంటర్ లో చేరే కరోనా బాధితులకు మెరుగైన వైద్యం అందించడంతో పాటు నాణ్యమైన ఆహారాన్ని ఇవ్వాలని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ డి.మురళీధర్ రెడ్డి.. అధికారులను ఆదేశించారు. అమలాపురం సమీపంలోని బోడసకుర్రు గ్రామంలో ఏర్పాటుచేసిన కొవిడ్ కేర్ కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. అక్కడ రోగులకు అందుతున్న వైద్య సదుపాయం, భోజనం, వసతి గురించి అడిగి తెలుసుకున్నారు. అమలాపురం సబ్ కలెక్టర్ హిమాన్షు కౌశిక్, ఇతర అధికారులు ఆయన వెంట ఉన్నారు.
'కరోనా బాధితులకు మెరుగైన వైద్యం అందించాలి' - కొవిడ్ కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్ మురళీధర్ రెడ్డి
తూర్పు గోదావరి జిల్లా బోడసకుర్రలో ఏర్పాటు చేసిన కొవిడ్ కేర్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ డి. మురళీధర్ రెడ్డి పరిశీలించారు. రోగులకు అందుతున్న వైద్య సేవలు, భోజన, ఇతర సేవలను వారిని అడిగి తెలుసుకున్నారు.
east godavari district visit covid care center