తూర్పు గోదావరి జిల్లా కొత్తపేటలో ఏర్పాటు చేసిన కొవిడ్ కేర్ సెంటర్‌ను జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే ప్రారంభించారు. ఏరియా ఆసుపత్రిని కొవిడ్ కేర్ సెంటర్‌గా మార్చి.. 20 పడకలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మురళీధర్ మాట్లాడుతూ.. అన్ని ఏరియా, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లను కొవిడ్ ఆసుపత్రులుగా మార్చే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.
వారం రోజుల్లో అన్ని కేంద్రాల్లో కనీసం 5 పడకలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. మెుదటగా కొత్తపేటలో ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రైవేటప ఆస్పత్రికి వెళ్తే చికిత్స బాగా చేస్తారనే అపోహల్లో ప్రజలు ఉన్నారనీ.. ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే మెరుగైన వైద్యం అందిస్తున్నామని తెలిపారు. ఖరీదైన మందులు సైతం ప్రభుత్వ ఆసుపత్రిలో అందుబాటులో ఉన్నాయనీ.. ప్రజలు వీటిని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు.