కరోనా పాజిటివ్ వ్యక్తి అత్మహత్య - తూర్పు గోదావరిలో కరోనా రోగి ఆత్మహత్య

10:24 August 03
కరోనా పాజిటివ్ వ్యక్తి అత్మహత్య
తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం మండలం ముండెపూలంకలో కరోనా బాధితుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంట్లో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. అవమానంతోనే ఉరేసుకున్నట్లు కుటుంబసభ్యులు చెప్పారు.
ముండెపూలంకకు చెందిన వ్యక్తికి గత నెల 31న కరోనా సోకింది. అప్పటి నుంచి హోం ఐసోలేషన్లో ఉంటున్నారు. ఈరోజు ఉదయం ఆయన భార్య అల్పాహారం ఇచ్చేందుకు తలుపు తట్టింది. తలుపు తీయలేదు.. చరవాణికి ఫోన్ చేస్తే స్పందన లేదు. దీంతో కిటికీలో చూడగా ఉరేసుకుని వేలాడుతున్న భర్తను చూసి భార్య బోరు మంది. అధికారులు అక్కడకు చేరుకొని మృతదేహాన్ని తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రత్యేక ఏర్పాట్ల ద్వారా మృతదేహాన్ని తరలిస్తామని ఎస్సై జి. సురేంద్ర వెల్లడించారు.
ఇదీ చదవండి: ఎస్ఈసీగా మరోసారి బాధ్యతలు స్వీకరించిన నిమ్మగడ్డ రమేశ్ కుమార్