తూర్పు గోదావరి జిల్లా అమలాపురం ఆర్డీవో బి.హెచ్ భవాని శంకర్ బదిలీ అయ్యారు. ఆయన గత ఏడాది అక్టోబర్ నుంచి అమలాపురం ఆర్డీవోగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 2 నెలల క్రితం ఆయనను కృష్ణా జిల్లా నూజివీడు ఇన్ఛార్జ్ ఆర్డీవోగా బదిలీ ఉత్తర్వులు వెలువడ్డాయి. అయినా రెండు నెలలుగా ఆయన అమలాపురంలోనే విధులు నిర్వహించారు.
అమలాపురం ఆర్డీవో నూజివీడుకు బదిలీ - తూర్పుగోదావరి జిల్లా వార్తలు
తూర్పుగోదావరి జిల్లా అమలాపురం ఆర్డీవో బి.హెచ్ భవాని శంకర్ కృష్ణా జిల్లా నూజివీడుకు బదిలీ అయ్యారు. రెండు నెలల క్రితమే ఆయనను బదిలీ చేసినప్పటికీ.. ఇప్పటి వరకూ అమలాపురంలోనే విధులు నిర్వహించారు. అమలాపురం నుంచి ఆయనను కలెక్టర్ రిలీవ్ చేశారు.
ఆర్డీవో బి.హెచ్ భవాని శంకర్
తాజాగా ఆయనను అమలాపురం నుంచి రిలీవ్ చేసి నూజివీడు ఆర్డీవోగా నియమిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు ఇచ్చారు. రాజమహేంద్రవరం గెయిల్‌లో విధులు నిర్వహిస్తున్న వసంత రాయుడుని అమలాపురం ఇన్ఛార్జిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
ఇదీ చదవండి :కరోనా సోకిన ఆర్టీసీ ఉద్యోగులకు.. ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స!
Last Updated : Jul 16, 2020, 11:40 AM IST