సుదీర్ఘ లాక్డౌన్ అనంతరం ఈ నెల 8 నుంచి దేవస్థానాల్లోకి భక్తులను అనుమతించే విధంగా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కానీ.. రెడ్ జోన్ లో ఉన్న కారణంగా తూర్పు గోదావరి జిల్లా అయినవిల్లిలోని సిద్ధి వినాయకుడి ఆలయంలోకి భక్తులకు ప్రవేశం కల్పించటం లేదు.
అయినవిల్లి మండలం మొత్తం మీద 17 కరోనా పాజిటివ్ కేసులు నమోదైన కారణంగా.. ఈ ప్రాంతం రెడ్ జోన్ పరిధిలో ఉంది. ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చిన తరవాత తదుపరి చర్యలు తీసుకుంటామని ఆలయ కార్యనిర్వహణాధికారి తారకేశ్వర రావు తెలిపారు.