17శాతం లోపు ఉన్న ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేయాలని ప్రభుత్వం విధించిన నిబంధన పట్ల తూర్పుగోదవరి జిల్లా గండేపల్లి మండలం మురారి గ్రామ రైతుల మండిపడ్డారు. ప్రభుత్వ నిబంధన వల్ల మిల్లర్లు, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు17శాతం కంటే తేమ ఎక్కువ ఉన్న ధాన్యాన్ని కొనగోలు చేయట్లేదని వాపోయారు. దీన్ని నిరసిస్తూ జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు.
"గత 18 సంవత్సరాలుగా పచ్చి ధాన్యాన్ని మిల్లర్లకు అమ్ముతున్నాం. ఎన్నడూ ఈ సమస్య రాలేదు. మా ప్రాంతంలో నీళ్లు ఎక్కుగా ఉండడం వల్ల ధాన్యం తేమగా ఉంటుంది. ఆరబెట్టడానికి స్థలం లేదు, ఆరబెట్టే యంత్రాలు లేవు. 40 ఎకరాల్లో పంట వేశాను. అందులో 32 ఎకరాలు లీజుకు తీసుకుని పండిచాను. ఇప్పుడు తేమ ఉన్న ధాన్యం కొనవద్దంటే నేను ఏం కావాలి?"