పుదుచ్చేరి ప్రభుత్వం పర్యావరణాన్ని కాపాడేందుకు గత 4 సంవత్సరాలుగా ఎన్నో సంస్కరణలు చేపట్టిందని ఆ రాష్ట్ర పర్యటకశాఖ మంత్రి మల్లాడి కృష్ణారావు అన్నారు. సౌరశక్తి, బయో డీజిల్‌తో నడిచే వాహనాలు ఉపయోగించే వారికి రాయితీలు ఇస్తున్నామని తెలిపారు. యానాంలో ఈ -బైక్ షోరూమ్‌ను ప్రారంభించారు. మొదటి బైక్ కొన్న విద్యార్థినికి ఆయన తాళం అందజేశారు. భవిష్యత్ అంతా పర్యావరణ సంరక్షిత వాహనాలదేనని.. ఆ దిశగా వ్యాపారులు మారాలని సూచించారు.
'భవిష్యత్ అంతా ఆ వాహనాలదే'
భవిష్యత్ అంతా పర్యావరణాన్ని సంరక్షించే వాహనాలదే అని పుదుచ్చేరి పర్యటకశాఖ మంత్రి మల్లాడి కృష్ణారావు తెలిపారు. యానాంలో ఈ - బైక్‌ల షోరూమ్‌ను ఆయన ప్రారంభించారు.
యానాంలో ఈ బైక్ షోరూమ్ ప్రారంభం