వాస్తవాలు తెలియకుండా లేనిపోని ఆరోపణలు చేయటం కాకినాడ మాజీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావుకు తగదని ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్రెడ్డి హితవు పలికారు. పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి జగన్ ప్రయత్నిస్తుంటే.. వనమాడి తన అనుచరుల చేత కోర్టుల్లో కేసులు వేయిస్తున్నారని మండిపడ్డారు.
గత ప్రభుత్వ హయాంలో వనమాడి అక్రమాలకు పాల్పడ్డారని.. వాటన్నింటిని బయటపెడతామని ఆయన వ్యాఖ్యానించారు. నెహ్రూ విగ్రహం తొలగింపు ప్రైవేటు వ్యవహారమని...విగ్రహాన్ని రాజా ట్యాంక్లో పెట్టడం జరుగుతుందని స్పష్టం చేశారు.