ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వైభవంగా దసరా ఉత్సవాలు.. విద్యార్థుల సరస్వతీ పూజలు - తూర్పు గోదావరిలో దసరా ఉత్సవాలు

తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా దేవినవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అమ్మవారు సరస్వతీ దేవి రూపంలో దర్శనమిచ్చారు. ఆలయాల వద్ద విద్యార్థులు సరస్వతి పూజలు నిర్వహించారు.

dussara celebrations at east godavari
పూజలు నిర్వహిస్తున్న విద్యార్థులు

By

Published : Oct 21, 2020, 3:51 PM IST

తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా దేవీ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. రావులపాలెంలో కనకదుర్గ అమ్మవారు శాఖాంబరి దేవిగా దర్శనమిచ్చారు. అమ్మవారిని వివిధ రకాల కూరగాయలు, పండ్లతో అలంకరించారు. ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు పాల్గొని అమ్మవారికి కుంకుమ పూజలు చేశారు.

అమలాపురంలోని శ్రీ దేవి అమ్మవారు సరస్వతీ దేవి రూపంలో దర్శనమిచ్చారు. అంబాజీపేట, పి. గన్నవరం మామిడికుదురు, రాజోలు, సఖినేటిపల్లి తదితర మండలాల్లో దుర్గాదేవి ఆలయాల వద్ద విద్యార్థులు సరస్వతి పూజలు చేశారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.

ABOUT THE AUTHOR

...view details