తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో విజయదశమి ఉత్సవాలు వైభవంగా జరిగాయి. దుర్గాదేవి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. అమలాపురంలోని శ్రీదేవి అమ్మవారిని మహిషాసుర మర్దిని అవతారంలో అలంకరించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అమలాపురంలో శ్రీ వాసవి మాత, వేపచెట్టు కనకదుర్గ, శ్రీ వైష్ణవి కనకదుర్గ అమ్మవారి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి.
అమలాపురంలో వైభవంగా దసరా ఉత్సవాలు - తూర్పుగోదావరిలో దసరా ఉత్సవాలు
తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో దసరా ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అమలాపురంలోని శ్రీదేవి అమ్మవారు మహిషాసుర మర్దిని అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు.
అమలాపురంలో వైభవంగా దసరా ఉత్సవాలు