తూర్పు గోదావరి జిల్లా కోనసీమలో దేవి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. కొత్తపేట నియోజకవర్గంలోని రావులపాలెం, ఆత్రేయపురం, ఆలమూరు, కొత్తపేట మండలంలో వెలసిన కనకదుర్గ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొన్ని ప్రాంతాల్లో ప్రత్యేకంగా మండపాలను ఏర్పాటు చేసి అమ్మవారి విగ్రహాలను ప్రతిష్టించారు. ఆలయాల వద్ద చలువ పందిళ్లు, అరటి మెక్కలు ఏర్పాటు చేసి.. ముఖద్వారాల వద్ద అందంగా అలంకరించారు. అధిక సంఖ్యలో భక్తులు ఆలయాలకు తరలివచ్చి అమ్మవారికి పూజలు నిర్వహించి, తీర్థప్రసాదాలు స్వీకరించారు.
కోనసీమలో ఘనంగా దేవి నవరాత్రి ఉత్సవాలు
దేవి నవరాత్రి మహోత్సవాలు తూర్పుగోదావరి జిల్లాలో వైభవంగా సాగుతున్నాయి. ఆలయాలను సుందరంగా అలంకరించారు. ప్రత్యేక పూజలకు భక్తులు కుటుంబాలతో సహా తరలివచ్చారు.
కోనసీమలో ఘనంగా దేవి నవరాత్రి ఉత్సవాలు