కరోనా వ్యాప్తి చెందుతున్న వేళ తూర్పుగోదావరి జిల్లా అధికారులు మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. మందుల దుకాణం వద్దకు జలుబు, దగ్గు, గొంతు నొప్పి లాంటి సమస్యలతో మందుల కోసం వచ్చే వారి వివరాలను కోవిడ్-19 ఏపీ ఫార్మా యాప్ లో కచ్చితంగా నమోదు చేయాలని తుని ఔషధ తనిఖీ అధికారిణి నాగమణి సూచించారు. దీనికి సంబంధించిన 'కెమిస్ట్ అనే నేను' పేరుతో గోడ పత్రికను ఆవిష్కరించారు. మందుల దుకాణదారులు తప్పనిసరిగా యాప్ ను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. కరోనా లక్షణాలతో ఎవరైనా మందులు కొనుగోలు చేయడానికి వస్తే వారి వివరాలు యాప్ లో నమోదు చేస్తే.. వైద్య అధికారులకు సమాచారం చేరి తదుపరి చర్యలు తీసుకుంటారని వివరించారు.
'జలుబు, దగ్గుతో మందుల షాపుకొస్తే వారి వివరాలు తెలపండి' - corona cases in east godavari
కరోనా నివాహణ చర్యల్లో భాగంగా అధికారులు అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. జలుబు, దగ్గు, గొంతు నొప్పి లాంటి సమస్యలతో మందుల కోసం వచ్చే వారి వివరాలను కోవిడ్ -19 ఏపీ ఫార్మా యాప్ లో కచ్చితంగా నమోదు చేయాలని... తుని ఔషద తనిఖీ అధికారి సూచించారు.
durg inspector