తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం దుళ్ల గ్రామంలో జనవరి 21న ఓ ఇంటిపై పెట్రోల్‌పై పోసి నలుగురి మరణానికి కారణమైన నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. విశాఖ జిల్లా రావికవతంలో ప్రధాన నిందితుడు శ్రీనివాస్, అతనికి సహకరించిన మరో వ్యక్తి మోహన్‌ను పట్టుకున్నారు. తనకు నచ్చిన అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయలేదనే ఉన్మాదంలో అర్ధరాత్రి కుటుంబ సభ్యులు నిద్రిస్తున్న వేళ నిందితులు ఇంటి బయట గొళ్లెం పెట్టి పెట్రోలు పోసి నిప్పంటించారు. ఈ ఘటనలో ఇద్దరు మహిళలు, ఒక యువకుడు, ఒక చిన్నారి మృతి చెందారు. జిల్లా వ్యాప్తంగా ఈ ఘటన సంచలనం కలిగించింది. ఇది అరుదైన కేసు అని నిందితులను 9 బృందాలతో గాలించామని ఎస్పీ హిమోషీభాజ్‌పేయ్ తెలిపారు.
ఇంటిపై పెట్రోల్ పోసి నలుగురి మరణానికి కారణమైన నిందితుల అరెస్టు - east godavari police arrested house petrol
తనకు నచ్చిన అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయలేదనే అక్కసుతో ఓ ఇంటిపై పెట్రోల్ పోసి నలుగురి మరణానికి కారణమైన ఇద్దరు నిందితులను పోలీసులు పట్టుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం దుళ్ల గ్రామంలో జనవరి 21న జరిగిన ఈ ఘటన పూర్తి వివరాలివి..!
మేనత్త ఇంటిపై పెట్రోల్ పోసిన అల్లుడ్ని పట్టుకున్న పోలీసులు