సంగం డెయిరీ ఛైర్మన్, తెలుగుదేశం సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్రను రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం నుంచి ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. రాజమహేంద్రవరంలోని డెల్టా ఆసుపత్రిలో ఈ నెల 20 వరకు హోం ఐసోలేషన్లో ఉంచనున్నారు. కేంద్ర కారాగారంలో రిమాండ్లో ఉన్న నరేంద్రకు కోవిడ్ పాజిటీవ్ నిర్దారణ కావడంతో విజయవాడ ఆయుష్ ఆసుపత్రిలో చికిత్స అందించారు. గత బుధవారం తిరిగి కేంద్ర కారాగారానికి తరలించారు. జ్యుడీషియల్ రిమాండ్లో ఉన్న వ్యక్తిని కోర్టుకు సమాచారం ఇవ్వకుండా జైలుకు తరలించడంపై విజయవాడలోని అనిశా న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. న్యాయస్థానం ఆదేశాల మేరకు నరేంద్రను అనిశా ఆసుపత్రికి తరలించింది. తిరిగి న్యాయస్థానం అనుమతించిన తర్వాత తిరిగి ఆసుపత్రి నుంచి కేంద్రకారాగారానికి తరలించనున్నారు.
జైలు నుంచి ఆసుపత్రికి ధూళిపాళ్ల నరేంద్ర తరలింపు
సంగం డెయిరీ ఛైర్మన్ ధూళిపాళ్ల నరేంద్రను రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం నుంచి ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అనిశా కోర్టు ఆదేశాల మేరకు ఈ నెల 20 వరకు ఆ ఆసుపత్రిలో చికిత్స అందించనున్నారు.
ధూళిపాళ్ల నరేంద్ర