లాక్డౌన్తో ఒంటరి మనుషుల జీవనం దుర్భరంగా మారింది. ఉపాధి దూరమై, సాయం చేసే వారు లేక ఆకలితో అలమటిస్తున్నారు. ఇలాంటి వారికి సాయం అందిస్తోంది ఓ సాధారణ రైతు కుటుంబం. రోజూ వందల మంది ఆకలి తీరుస్తోంది. తూర్పు గోదావరి జిల్లా తాళ్లరేవుకి చెందిన నందికోళ్ల శ్రీమన్నారాయణ, శ్రీదేవి దంపతులు నిత్యం వంద మందికిపైగా పేదల ఆకలి తీరుస్తున్నారు. సాధ్య ఫౌండేషన్ పేరుతో... లాక్డౌన్ విధించినప్పటి నుంచి ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. నా అన్నవారు ఎవరూ లేనివారికి రోజూ వేడివేడిగా వండి వడ్డిస్తున్నారు. వీరి దాతృత్వాన్ని చూసిన మరికొందరు దాతలు వారికి సహకరిస్తున్నారు. లాక్డౌన్ ఎత్తివేసిన తర్వాత కూడా ఒంటరిగా జీవించే వారికి ఆహారం అందిస్తామని ఆ రైతు కుటుంబం చెబుతుంది. ఒంటరిగా ఉన్న తమను ఆదుకొని.. కష్ట కాలంలో కాస్త ముద్ద పెడుతున్న రైతు కుటుంబానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు పేదలు.
సాధారణ రైతు కుటుంబం... వందలమంది కడుపు నింపుతోంది - తూర్పుగోదావరిలో ఆహారం పంపిణీ వార్తలు
కరోనా కష్టకాలంలో మనందరికి నా అన్న భరోసా ఉంది. పనికి వెళ్లకపోయినా నాన్న, అమ్మ.. అన్న.. ఇలా ఎవరో ఒక్కరు కష్టించి తెచ్చిపెడతారన్న ధైర్యం ఉంది. మరి ఎవరూ లేనివారి పరిస్థితేంటి. ఒంటరిగా ఉంటూ రోజు కూలీ చేసుకొని బతికేవారి సంగతేంటి. పనులు లేక ఆకలితో అలమటిస్తున్న వారి మాటేంటి. సరిగ్గా ఈ విషయాన్నే ఆలోచించిందేమో ఆ ఫౌండేషన్. ఒంటరిగా అలమటిస్తున్నవారి ఆకలి తీరుస్తోంది.
dueto corona lockdown Distributing food for people at Tallarevu in East Godavari District