తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో ఉన్న ఒకే ఒక్క ఇసుకరేవును అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. అక్రమంగా ఇసుకను తవ్వేస్తున్నారన్న ఆరోపణలు రావడంపై.. తాళ్ళరేవు మండలం పిల్లంక రేవు వద్ద కార్యకలాపాలు నిలిపేశారు. ఈ ప్రాంతంలో.. నావల యజమానులు, ఇసుక సేకరించే కూలీలతో ఒక అవగాహన మేరకు.. ఇసుక రేవు నిర్వహించేవారు. ఇటీవల అక్రమాలు జరుగుతున్నాయంటూ ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్న నేపథ్యంలో.. పిల్లంక రేవును అధికారులు మూసేశారు. ఫలితంగా.. వందలాది ట్రాక్టర్లు నిలిచిపోయాయి. కూలీలకు పని లేకుండా పోయింది. ఇది తమను ఆర్థికంగా ఇబ్బంది పెడుతోందని కూలీలు, ట్రాక్టర్ల యజమానులు ఆవేదన చెందుతున్నారు.
ఉన్నదే ఒక్క రేవు.. మూసేస్తే ఎలా? - తూర్పుగోదావరిజిల్లా
ఇసుక తవ్వకాల్లో అక్రమాలపై.. అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. తూర్పుగోదావరి జిల్లాలోని పిల్లంక రేవును తాత్కాలికంగా ముసేశారు.
ఇసుక రేవు నిలిపివేత